సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:16:30

కూల్చివేతను ఆపలేం

కూల్చివేతను ఆపలేం

  • పాత భవనాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టీకరణ
  • నూతన సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్
  • భవనాల కూల్చివేత న్యాయసమీక్ష పరిధిలోకి రాదు
  • రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం 
  • పిటిషన్ కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
  • కూల్చివేతలకు పర్యావరణ అనుమతి అక్కర్లేదు
  • హైకోర్టుకు నివేదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్
  • ఆ వాదనతో ఏకీభవించిన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం

కొత్త సచివాలయాన్ని అడ్డుకోవాలని ఆఖరు నిమిషం వరకూ ప్రయత్నించిన వారికి చుక్కెదురైంది. పాత భవనాల కూల్చివేతపై సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్లువేసిన వారికి.. చివరకు నిరాశే మిగిలింది. అటు సుప్రీంకోర్టులో.. ఇటు హైకోర్టులో ఒకే రోజు లభించిన రెండు విజయాలతో.. రాష్ర్టానికే గర్వకారణమైన రీతిలో కొత్త సచివాలయం సగర్వంగా నిర్మాణానికి సన్నద్ధం కానున్నది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లలో ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా అటు సుప్రీంకోర్టులో, ఇటు రాష్ట్ర హైకోర్టులో తీర్పులు వెలువడ్డాయి. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ దాఖలుచేసిన పిటిషన్ జస్టిస్ అశోక్ జస్టిస్ సంజయ్ కిషన్ జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. భవనాల కూల్చివేతకు జూన్ 29న హైకోర్టు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ జీవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దానిని జస్టిస్ అశోక్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాలు ఉన్నాయా? లేదా? అనే విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయని, ఆర్టికల్ 136 ప్రకారం విధానపర నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే రాంచంద్రరావు, న్యాయవాది ఉదయ్ వాదనలు వినిపించారు. ‘సచివాలయం ఎంత పెద్ద ప్రాంతమైనా కావచ్చు. తెలంగాణ మంత్రివర్గ నిర్ణయంలో ఏమైనా ఉండవచ్చు. కానీ సచివాలయాన్ని కూల్చాలన్న క్యాబినెట్ నిర్ణయం మాత్రం న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు’ అని జస్టిస్ అశోక్ వ్యాఖ్యానించారు. విచారణ కన్నా ముందే కేవియట్ పిటిషన్ దాఖలుచేసిన తెలంగాణ ప్రభుత్వం.. తమ వాదనలు వినాలని విజ్ఞప్తి చేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ వాదనలు పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు.. జీవన్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది.


పాతది కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలన్న తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు. భవనాలు అవసరాలకు తగిన విధంగా ఉన్నాయా? లేదా? అనేది ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయం కిందకి వస్తుంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ పరిశీలన జరిపి, పిటిషనర్ వాదనలను తిరస్కరించింది. ఇక మేము జోక్యం చేసుకునేది ఏమీ లేదు.

- సుప్రీంకోర్టుకూల్చివేతలు భూమి చదును చేయడం కిందకు వస్తుందనే నిర్వచనం పర్యావరణ పరిరక్షణ చట్టంలోగానీ, ఎన్విరాన్ ఇంపాక్ట్ అసెస్ నోటిఫికేషన్ లేదు. భవనాల కూల్చివేతకు ప్రభుత్వానికి అధికారం ఉన్నది. అందుకు అన్ని అనుమతులను తీసుకున్నది. 

- రాష్ట్ర హైకోర్టు


కూల్చివేత..  చదును చేయడమా?: హైకోర్టు

సచివాలయ భవనాల కూల్చివేత భూమిని చదును చేయడం కిందికి వస్తుందనే వాదనలో అర్థం లేదని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ పాత భవనాలను కూల్చివేస్తున్నారని వివి ధ పార్టీల నాయకులు పీఎల్ విశ్వేశ్వర్ చెరుకు సుధాకర్ దాఖలుచేసిన పిటిషన్ శుక్రవారం కొట్టేసింది. కూల్చివేతలు భూమి చదునుచేయడం కిందకి వస్తుందనే నిర్వచనం పర్యావరణ రక్షణ చట్టం-1986లోగానీ.. ఎన్విరాన్ ఇంపాక్ట్ అసెస్ నోటిఫికేషన్-2006లోగానీ లేదని హైకోర్టు స్పష్టంచేసింది. కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేద న్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ విజయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తుది తీ ర్పును వెలువరించింది. భవనాల కూల్చివేతకు ప్రభుత్వానికి అధికారం ఉన్నదని.. ఈ మేరకు ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నదని స్పష్టంచేసింది. భవన నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, ఇతర నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్నది.

పర్యావరణశాఖ లేఖ సమర్పించిన ఏఎస్

హైకోర్టు ఆదేశాల మేరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్ రాజేశ్వర్ కేంద్ర పర్యావరణశాఖ వివరణను హైకోర్టు సమర్పించారు. కూల్చివేత ప్రక్రియకు నిర్మాణం- కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుంటే సరిపోతుందని, కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరంలేదని పేర్కొన్నారు. ఎన్విరాన్ ఇంపాక్ట్ అసెస్ నోటిఫికేషన్-2006లో పర్యావరణ అనుమతి తీసుకోవాలని కూడా లేదని హైకోర్టుకు తెలిపారు. పర్యావరణ అనుమతి అవసరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు ఏఎస్ మద్దతు తెలిపారు. నిర్మాణం- కూల్చివేత వ్యర్థాల నిర్వహణ- 2016 4(3) నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నదని పేర్కొన్నారు. 

మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది: ఏజీ

పాత సచివాలయ భవనాలను కూల్చి, సమీకృత, కళాత్మక (స్టేట్ ఆఫ్ ది ఆర్డ్ అండ్ ఐకానిక్) సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు క్యాబినెట్ తీర్మాన ప్రతిని, స్టేట్ లెవెల్ ఎన్విరాన్ ఇంపాక్ట్ అసెస్ అథారిటీ (ఎస్ జీహెచ్ నుంచి తీసుకున్న అనుమతుల పత్రాలను హైకోర్టుకు సమర్పించామని తెలిపారు. సచివాలయం కూల్చివేత వల్ల కాలుష్య సమస్య రాకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాజ్యాంగ, చట్టపరమైన విధుల పట్ల పూర్తి అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆధారాలు లేని పిటిషనర్ల వాదనలు అర్థరహితమని, అవి నిలకడలేనివని వ్యాఖ్యానించింది. డిజాస్టర్ మేనేజ్ యాక్ట్, ఎపిడకమిక్ డిజాస్టర్ యాక్ట్ నిబంధనలకు సచివాలయ భవనాల కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. 

హైకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే..

ఎస్పీ ముత్తురామన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుపై పిటిషనర్ ఎక్కువగా ఆధారపడ్డారు. ఇక్కడ ఎన్విరాన్ ఇంపాక్ట్ అసెస్ నోటిఫికేషన్ 2006 ప్రకారం కూల్చివేతలకు ముందస్తు పర్యావరణ అనుమతి అవసరం లేదని స్పష్టమవుతున్నది. నిర్మాణం- కూల్చివేత వ్యర్థాల నిర్వహణ- 2016 ప్రకారం స్థానిక సంస్థ (జీహెచ్ అనుమతిని ప్రభుత్వం పొందింది. వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను సైతం సమర్పించింది. దీన్నిబట్టి ప్రభుత్వం చట్టంలో పేర్కొన్న నిబంధనలను పాటించినట్టు స్పష్టమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఆర్టికల్-21 కింద నాణ్యమైన గాలిని కలిగి ఉండే హక్కు కాలరాస్తున్నారనే పిటిషనర్ వాదన న్యాయవిరుద్ధం. తన వాదనలను సమర్థించుకునేందుకు పిటిషనర్ ఆధారాలేమీ సమర్పించలేదు. ఈ పిటిషన్ ఎలాంటి మెరిట్స్ కనిపించలేదు. అందుకే డిస్మిస్ చేస్తున్నాం’.

అభివృద్ధిని అడ్డుకోవడం మూర్ఖత్వం

కోర్టుల్లో వ్యాజ్యాలు వేస్తూ, అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం మూర్ఖత్వం. 132 ఏండ్ల కిత్రం నిర్మించిన సచివాలయ భవ నం శిథిలావస్థకు చేరింది. దాని స్థానంలో కొత్తది నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నేతలతోపాటు మరికొందరు హైకోర్టులో 8 వ్యాజ్యా లు దాఖలుచేశారు. హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాఖలైన పిటిషన్లను రెండు కోర్టులు కొట్టేశాయి. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న కోర్టుల వ్యాఖ్యలను పిటిషనర్లు గుర్తించాలి. ఉద్దేశపూర్వకంగా మంచిపనులు అడ్డుకోవడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.

- కొంతం గోవర్ధన్ అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్


logo