మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 17:22:35

మావోయిస్టులకు సహకరించొద్దు : డీజీపీ

మావోయిస్టులకు సహకరించొద్దు : డీజీపీ

కొమురంభీం ఆసిఫాబాద్: ఆదివాసులు నక్సలైట్లకు సహకరించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. జిల్లాలో మావోయిస్టుల సంచారం నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులతో శుక్రవారం డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పదేండ్ల నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు లేవని, మళ్లీ ఐదుగురు మావోయిస్టులు తిరిగి ఎంటర్ అయ్యారని  అన్నారు. మావోయిస్టు నేత భాస్కర్ నేతృత్వంలో వారు ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతున్నారని చెప్పారు.  తప్పించుకు తిరుగుతున్న మావోల కోసం 500 మంది ప్రత్యేక పోలీసులు కూంబింగ్‌లో ఉన్నారని డీజీపీ వివరించారు. త్వరలోనే మావోయిస్టులను పట్టుకుంటామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను కట్టడి చేస్తామని అన్నారు.


logo