సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 17:04:19

వీధి వ్యాపారులకు చేయూత : మంత్రి హరీశ్ రావు

వీధి వ్యాపారులకు చేయూత : మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి  : కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చితి కి పోయి ఇబ్బందుల్లో ఉన్న వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణ సదుపాయం కల్పించి భరోసా కల్పిస్తున్నామని ఆర్థిక శాఖ  మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ వీధి విక్రయ వ్యాపారుల రుణ మేళ కార్యక్రమానికి మంత్రి హాజరై  మంజూరు ఉత్తర్వులను, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎం స్వానిధి (pm swanidhi ) ద్వారా మున్సిపల్ పట్టణాల్లోని  వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున రుణం అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5,978 మంది వీధి వ్యాపారులను గుర్తించి రూ.5 కోట్ల 97లక్షల 80 వేల రుణాలను అందిస్తున్నామన్నారు.

మున్సిపల్ పట్టణాల్లో  పండ్లు, పూలు ,కూరగాయలు, పానీపూరి, గుడాలు, బజ్జీలు, టీ విక్రయించే వారు, ఇస్త్రీ, చెప్పులు కుట్టే వారు తదితర అస్థిరమైన వ్యాపారాలు చేసే చాలా మంది చిరు వీధి వ్యాపారులు ఉన్నారన్నారు. అలాంటి వారందరినీ గుర్తించి వారికి రుణ సదుపాయాన్ని కల్పించాలని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లకు మంత్రి సూచించారు. చిట్టచివరి వ్యాపారికి రుణం అందజేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ పై ఉందన్నారు. స్వానిధి కింద రుణం తీసుకునే వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి సూచించారు.logo