మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 13:26:44

పల్లె ప్రగతిలో ఆదర్శం సంగారెడ్డి జిల్లా : మంత్రి హరీశ్ రావు

పల్లె ప్రగతిలో ఆదర్శం సంగారెడ్డి జిల్లా : మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. పఠాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 55 గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పలు గ్రామాలకు సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు పంపిణీ చేయడం రాష్టం లోనే ప్రథమం అన్నారు.

ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్‌, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఆదర్శంగా ఉన్నామన్నారు. వచ్చే నెల రోజుల్లో జిల్లాలో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జిల్లాలో 100 పడకల కరోనా దవాఖాన ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. 


logo