మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 23:11:58

అన్నవరం ప్రసాదం ఇలా తినాలి

అన్నవరం ప్రసాదం ఇలా తినాలి

రాజకీయాలు, సాహిత్యాంశాల్లోనే కాదు ఇతర సామాజిక ఆచారాలపైనా పీవీకి స్పష్టమైన అవగాహన ఉండేది. ఎక్కడ ఎలా మసలుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ప్రధానిగా ఉన్నపుడు పీవీ ఒకసారి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవాలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కూడా ఉన్నారు. పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయ పూజారి పీవీకి సత్యనారాయణస్వామి ప్రసాదాన్ని అందజేశారు. పీవీ దాన్ని భక్తితో నోట్లో వేసుకున్నారు. అంతలోనే పక్కనే ఉన్న రోశయ్య ఆయనకు చేయి తుడుచుకోవడానికి న్యాప్కిన్‌ అందజేయబోయారు. దీంతో రోశయ్యను పీవీ సున్నితంగా వారించి ‘రోశయ్యా, ఇది స్వామివారి ప్రసాదం. తిన్న చేయిని తుడవకూడదు. మొదట చేయిని నాకాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇదీ పద్ధతి’ అంటూ అలాగే చేశారు. ఈ విషయాన్ని పత్రికలు అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి. 


logo