శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 23:11:58

మృదంగ తరంగాలపై..

మృదంగ తరంగాలపై..

పీవీ నరసింహారావు ఏకసంథాగ్రాహి. ఒకసారి సమీప బంధువు ఒద్దిరాజు రాజేశ్వర్‌ ఇంట్లో పీవీ కాలక్షేపం చేస్తుండగా అక్కడికి ఒక సంగీత బృందం వచ్చింది. వారిలో ఓ కళాకారుడు మృదంగం వాయిస్తుండగా పీవీ మైమరచిపోయి ఆ నాదాన్ని ఆస్వాదించారు. అతడు మృదంగం వాయించే విధానాన్ని పరిశీలించారు. సంగీత కచేరి పూర్తికాగానే ‘నేను మృదంగం నేర్చుకుంటా’ అని ఉత్సాహంతో బంధువు రాజేశ్వర్కు చెప్పారు పీవీ. అది చాలా కష్టంతో కూడుకున్నదని ఆయన నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా పీవీ తన పట్టువీడలేదు. దీంతో రాజేశ్వర్‌ మరుసటి ఉదయమే ప్రఖ్యాత మృదంగ వాద్యకారుడు తంబళ్లపల్లి పుల్లయ్య వద్దకు తీసుకెళారు. ఆయన మృదంగం వాయించి చూపుతుండగా పీవీ తీక్షణంగా పరిశీలించారు. అనంతరం పుల్లయ్య ఏ విధంగా వాయించారో.. అచ్చం అదే విధంగా పీవీ మృదంగాన్ని వాయించి చూపారు. ఆశ్చర్యపోయిన పుల్లయ్య ‘ఇతడు పిలగాడు కాదు.. పిడుగు’ అని మెచ్చుకొన్నారు.


logo