బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 23:11:58

ఎత్తేది బరువు కాదు.. దేశ పరువు

ఎత్తేది బరువు కాదు.. దేశ పరువు

పీవీ నరసింహారావుకు క్రీడలంటే ఆసక్తి. స్వయంగా ఆయన టెన్నిస్‌ క్రీడాకారుడు. 70 ఏండ్లు వచ్చేవరకు ఆ ఆటను ఆడారు. 1990లో గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాక ఆడటం మానేశారు. ఆ తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌ ఇతర ఆటలు చూస్తూ గడిపేవారు. ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌కు వెళ్లే క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. ఒకానొక సందర్భంలో భారత వెయిట్‌ లిఫ్టర్లతో ఆయన మాట్లాడుతూ ‘మీరు ఎత్తేది బరువు కాదు.. దేశ పరువు’ అని వారిలో స్ఫూర్తినింపారు. రాజకీయంగా ఎంత  బిజీగా ఉన్నా వెసులుబాటు చూసుకుని క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఆయన తప్పక హాజరయ్యేవారు.


logo