బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 21:26:11

కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకం: సీపి అంజని కుమార్

 కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకం: సీపి అంజని కుమార్

హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న పోలీసులను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ విధుల్లోకి ఆహ్వానించారు. నగరంలోని పశ్చిమ మండల పరిధిలోని పలు పోలీస్టేషన్లకు చెందిన 45 మంది సిబ్బంది సీపీ ఆధ్వర్యంలో తిరిగి తమ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకమైందని అన్నారు. భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ నుంచి రక్షించుకోవచ్చని ఆయన వెల్లడించారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని అంజనీకుమార్‌ అభిప్రాయపడ్డారు.లాక్ డౌన్, నియంత్రణ ప్రదేశాలు, వలస కూలీల తరలింపులో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వైరస్‌ నుంచి కోలుకున్న వాళ్ళు ఇతరులకు కరోనా గురించి అవగాహన కల్పించి ధైర్యం చెప్పాలని అంజనీకుమార్‌ కోరారు.


logo