పొలాల్లోని భాస్వరం కరిగించేద్దాం

తెలంగాణ రైతులు రసాయన ఎరువుల వాడకంలో భాగంగా.. అధిక మొత్తంలో భాస్వరం(డీఏపీ) ఉపయోగిస్తున్నట్లు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. తెలంగాణ భూముల్లో భాస్వరం నిల్వలపై వర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 6వేల మట్టి నమూనాలను సేకరించి పరిశోధించింది. 546 మండలాల్లో నమూనాలు సేకరించగా 208
మండలాల్లో అధిక భాస్వరం నమూనాలు ఉన్నట్లు గుర్తించారు.
...ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల్ల, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో 90 శాతానికి పైగా మండలాల్లో భాస్వరం నమూనాలు 50 శాతం కన్నా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భాస్వరం వినియోగం తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖవారికి విశ్వవిద్యాలయం సూచించింది. ఆ ప్రకారం వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతున్నది. అధిక భాస్వరం నమూనాలు గుర్తించిన మండలాల్లో రైతులకు డీఏపీ వాడకంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అధిక నమూనాలు ఉన్న చోట ఈ ఏడాది సాధారణంగా వినియోగించే ఎరువుల కన్నా 50 శాతం తక్కువ ఉపయోగించాలని సూచించారు.
భాస్వరం నిల్వల కరిగింపు
రైతులు ప్రతియేటా వేసే భాస్వరంలో 15-20 శాతం మాత్రమే పంట గ్రహిస్తుంది. మిగిలిన 80శాతం కరగకుండా పైపొరల్లో ఉండిపోతుంది. దీంతో యేటికేడు భాస్వరం నిల్వలు పెరిగిపోతున్నాయి. నేలల్లో అధిక మొత్తంలో పేరుకుపొయిన భాస్వరం నిల్వలను జీవన ఎరువులు(పీఎస్బీ బ్యాక్టీరియా)తో తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. ఈ బ్యాక్టీరియాను భూమిలో వేయడంతో పాటు విత్తనాలకు పట్టించడం ద్వారా భాస్వరాన్ని నియంత్రించవచ్చని రైతులకు సలహా ఇచ్చింది.
తాజావార్తలు
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!
- చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
- 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- ఐఎస్ఎస్లోని ఆస్ట్రోనాట్‌తో మాట్లాడిన కమలా హ్యారిస్.. వీడియో
- మాస్ బీట్‌కు సాయి పల్లవి స్టెప్పులు అదుర్స్
- పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం సక్సెస్
- కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడి కాల్చివేత
- పూజా హెగ్డే ఇంట్లో విషాదం.. దుఃఖ సాగరంలో మునిగిన బుట్టబొమ్మ