మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 13:38:58

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : జిల్లాలోని రఘునాధపాలెం మండలం పాపటపల్లి, బుడిదెంపాడు గ్రామంలో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


logo