మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:05:32

కాంగ్రెస్‌.. ద్రోహులపార్టీ

కాంగ్రెస్‌.. ద్రోహులపార్టీ

  • హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 పెట్టాలా?
  • బానిస బతుకు, బానిస మనస్తత్వం
  • ఉత్తమ్‌ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం
  • కాంగ్రెస్‌పై మంత్రి జగదీశ్‌ ఆగ్రహం
  • సచివాలయం కట్టితీరుతామని స్పష్టం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు కుక్కబుద్ధి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుక్క తనకు అన్నం దొరుకకుంటే కుండలో మూతిపెట్టి దానిని పగుల గొడుతుందని, కాంగ్రెస్‌ నాయకుల వైఖరి కూడా అదేవిధంగా ఉన్నదని, తమకు అధికారం లేదు కాబట్టి తిరిగి ఉమ్మడి రాష్ట్రంగా మారుద్దామనేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సెక్షన్‌-8 అమలుచేయాలని కోరుతున్న వారి అజ్ఞానం, మూర్ఖత్వం చూసి ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులది బానిస మనస్తత్వమని, బానిస బతుకులు బతికారని, బీ ఫాం, మంత్రి పదవుల కోసం ఆంధ్ర నాయకత్వం మోచేతి నీళ్లు తాగారని ధ్వజమెత్తారు. అదే అలవాటై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్త మ్‌ రాజీనామాచేసిన హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు 40 వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు. ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పనికిరాడని ఆ పార్టీ నాయకులే అంటున్నారని పేర్కొన్నారు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం దేశంలో ఎక్కడాలేదన్నారు. 

ఏ పథకాన్నైనా ఆపి కడుతున్నామా: తలసాని 

ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మం త్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శిస్తే సహించబోమన్నారు. పార్లమెంట్‌కు నూతన భవనాన్ని నిర్మించడంలేదా, ఆ భవనానికి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలనే దుర్మార్గపు ఆలోచనచేశారని కాంగ్రెస్‌ నేతలపై ఆగ్రహంవ్యక్తంచేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే ఉరుకోబోమన్నారు. సచివాలయం అనేది  ప్రభుత్వానికి సంబంధించిన అంశమని స్పష్టంచేశారు. నుంచి నేటివరకు మ్యానిఫెస్టోలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలుచేశామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు.

దేశం మొత్తం వ్యవసాయరంగం తిరోగమనంలో ఉంటే తెలంగాణలో పురోగమనంలో ఉన్నదని ఒక జాతీయ పత్రిక సోమవారం విశ్లేషించిందని గుర్తుచేశారు. రైతుబంధు అమలైననాటినుంచి రూ.32 వేల కోట్లు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా రైతుల వద్ద ఉన్నాయని చెప్పారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతున్నదని, ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లు నిర్మించామని తెలిపారు. 2018 నుంచి అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ నాయకులకు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ప్రజలు కాంగ్రెస్‌ నేతల చేతికి చిప్ప ఇచ్చారని ఎద్దేవాచేశారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ రా ములు మాట్లాడుతూ..కాంగ్రెస్‌ నాయకులు నిరాశ, నిసృహలో పడ్డారని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo