మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 18:50:57

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర‌ అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి ఎర్రబెల్లి స‌మీక్ష

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర‌ అభివృద్ధి ప‌నుల‌పై  మంత్రి ఎర్రబెల్లి స‌మీక్ష

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర‌ అభివృద్ధి ప‌నుల‌పై మ‌రోసారి స‌మీక్షించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు. సీఎం హామీల అమ‌లు, సీఎం చేతుల మీదుగా కుడా మాస్టర్ ప్లాన్ విడుద‌ల‌, కేటీఆర్ పర్యటన‌, అర్హులైన వాళ్లంద‌రికీ డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాల ప‌ట్టాలు, హృద‌య్, స్మార్ట్ సిటీ, జ‌య‌శంక‌ర్ స్మృతి వ‌నాల‌ ప‌నులు పూర్తి, న‌గ‌ర‌ ప్రగతి, వ‌రంగ‌ల్ రింగ్ రోడ్డు, భూసేక‌ర‌ణ ప‌నుల‌పైనా స‌మీక్షించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్ ఎంపీలు బండా ప్రకాశ్‌, ప‌సునూరి ద‌యాక‌ర్, రైతు రుణ విముక్తి చైర్మన్ నాగూర్ల వెంక‌టేశ్వరరావు, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, టి.రాజ‌య్య‌, అరూరి ర‌మేశ్, నన్నపనేని న‌రేంద‌ర్, మేయ‌ర్ గుండా ప్రకాశ్ రావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని ర‌వీంద‌ర్ రావు,  కుడా చైర్మన్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్రటరీ అర‌వింద్ కుమార్, వ‌రంగ‌ల్ అర్బన్ క‌లెక్టర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్పతి త‌దిత‌రులతో క‌లిసి ఈ స‌మీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో మంజూరైన డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరిత‌గ‌తిన పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. నగరంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులైన భద్రకాళి ట్యాంక్ బండ్ సుందరీకరణ, రూ. 65 కోట్ల వ్యయంతో చేప‌ట్టిన 11 స్మార్ట్ రోడ్డు పనులు, ప్రధాన ఆహ్వాన ద్వారాలు,  4 స్మార్ట్ రోడ్ పనుల  పురోగతి ని సమీక్షించి సమర్ధంగా నిర్వహించడానికి వీలుగా మంత్రి పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ ముగిసినందున ఇసుక ఇతర వాటికి అనుమతి ఇచ్చే అవకాశాలు న్న నేపథ్యంలో  ఆయా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయా ప‌నుల‌కు మ‌రిన్ని నిధులు మంజూర‌య్యేలా మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ల‌ను క‌లిసి అభ్యర్థించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 


logo