శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 15:57:02

గంగా ఉప్పొంగగా..పాలమూరు పచ్చబడగా

గంగా ఉప్పొంగగా..పాలమూరు పచ్చబడగా

నీళ్లు లేక నోళ్లెళ్లబెట్టిన చెరువులు, కుంటలు. కనుచూపు మేర ఎడారిని తలపించే దయనీయ పరిస్థితి. బుక్కెడు బువ్వ గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పిల్లా పాపలతో సుదూర ప్రాంతాలకు వలస పోయే పాలమూరు ప్రజల ధైన్య స్థితి. ఇది నాటి పాలమూరు బతుకు చిత్రం.

పరవళ్లు పెడుతోంది గంగమ్మ..పచ్చ బడుతోంది పాలమూరు నేలమ్మ..జల సిరుల పులకరింతతో పైపైకి ఎగురుతున్న పక్షులు. ప్రాజెక్ట్ లు, చెక్ డ్యాం ల నిర్మాణంతో ఊపందుకున్న వ్యవసాయం. వలస వెళ్లిన జనం సేద్యం చేసేందుకు తిరుగు ముఖం పడుతున్న పాలమూరు బిడ్డలు. ఇది నేటి పాలమూరు ఆకు పచ్చని జీవన చిత్రం.

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం బండ్రవల్లి వాగు పై నిర్మించిన చెక్ డ్యాం అలుగు పారుతున్న సందర్భంగా చుట్టూ పచ్చ బడ్డ ప్రకృతి గల గల పారుతున్న గంగమ్మ ని చూసి పక్షుల గుంపు ఇలా ఎగురుతున్న అపురూప దృశ్యాన్ని నమస్తే తెలంగాణ ఫొటో గ్రాఫర్ బందిగె గోపి తన కెమరాలో బంధించారు.logo