గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 15:24:43

కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న నేతలు

కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న నేతలు

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్ లో చేరారు. మధిర మండలం ఆత్కూర్ గ్రామం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యలో ఖమ్మంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణి, ఎంపీటీసీ మినుగు పాండురంగారావు, వైస్ సర్పంచ్ ఖమ్మంపాటి చిట్టిబాబు, వార్డు సభ్యులు మినుగు రమాదేవి, లక్ష్మీ, అంకె శిరీష, ఎస్కే లాల్ సాహెబ్, బి కృష్ణ, కె సాల్మన్, దివ్య, ఏ వెంకటేశ్వర్లు తో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ స్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి , నల్లమల వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి చితారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, భరత్ వెంకటరెడ్డి, కర్నాటి శ్రీనివాసరావు, చావా వేణు తదితరులు ఉన్నారు.logo