బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 11:08:05

సకల సదుపాయలతో యాదాద్రి

సకల సదుపాయలతో యాదాద్రి

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణిస్తున్న పంచనారసింహక్షేత్రం యాదాద్రి పనులు ఎట్టకేలకు తుదిదశకు చేరుకున్నాయి. దీంతో అధికారులు భక్తుల సౌకరయార్ధం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ఆలయ ఈవో గీత, అధికారులు, కాంట్రాక్టర్లు, స్థపతులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రధానాలయంలో మూలవరుల పున్యదర్శనం ప్రారంభమయ్యేనాటికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో సంర్శకులకు ఆహ్లాదం కలిగించే విధంగా సుగంధం వెదజల్లే మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. భక్తులకు వసతితో పాటు ఆలయ దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo