శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 17:37:28

రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ

రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ ఏఈ

భద్రాద్రి కొత్తగూడెం : ఇరిగేషన్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన జిల్లాలోని ఇల్లెందు మండలంచోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గతంలో చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్‌ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు ఫైనల్ చేయాలని ఏఈ నవీన్ ను కోరాడు. 

బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.20 లక్షలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ రమేష్ నగదు ఇస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ వద్ద పట్టుబడ్డ రూ.1.20ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, విచారణ అనంతరం హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించి రిమాండ్  చేయనున్నట్లు డీఎస్సీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు ఎస్వీ రమణమూర్తి, రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు.



logo