శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 16:44:35

సీఎం కేసీఆర్ హరిత సంకల్పాన్ని సాకారం చేద్దాం : మంత్రి వేముల

సీఎం కేసీఆర్ హరిత సంకల్పాన్ని సాకారం చేద్దాం : మంత్రి వేముల

హైదరాబాద్ : పచ్చదనాన్ని పెంపొందించి ప్రకృతిని పరిరక్షించుకోవాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మొక్కలు నాటాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని హౌసింగ్ కార్పొరేషన్ లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం హౌసింగ్ డిపార్ట్ మెంట్, హౌసింగ్ కార్పొరేషన్ తరుఫున మా డిపార్ట్ మెంట్ సిబ్బందితో కలిసి 2.8 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. 

ఖాళీ స్థలం ఉన్న అన్ని చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న హౌసింగ్ డిపార్ట్ మెంట్, హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బందిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, సీఈలు రవీందర్ రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.


logo