ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 23:35:55

తెలంగాణ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది: జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు

 తెలంగాణ సర్కారు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది: జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు

ఖమ్మం : రైతుకు తెలంగాణ సర్కారు అన్ని రకాల సహాయ,సహకారాలు అందిస్తూ దేశానికి అగ్రగామిగా నిలిచిందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆయన ఆదివారం ఎర్రుపాలెం మండలంలో ని,బనిగండ్లపాడు, మీనవోలు సహకార సంఘాల ఆధ్వర్యంలో ఋణాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సమయంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ చేయడం రైతులకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని, తెలంగాణ రాష్ట్రం రైతులకు సహాయ, సహకారాలు అందించడంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. ఈకార్యక్రమం అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, డిసిసిబి డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర్ రెడ్డి,ఎంపీపీ దేవరకొండ శిరీష,జడ్పిటిసి శీలం కవిత, పంబి సాంబశివరావు,సొసైటీ చైర్మెన్ కుడుముల మధుసూదన్ రెడ్డి,సొసైటీ చైర్మన్ శీలం అక్కి రెడ్డి,అనుమోలు సాంబశివరావు,సర్పంచుల సంఘం అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


logo