సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 17:46:02

భద్రకాళీ శరణం మమ..ముగిసిన శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు

భద్రకాళీ శరణం మమ..ముగిసిన శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు

రంగల్‌ అర్బన్ : చారిత్రక భద్రకాళీ ఆలయంలో పదిహేను రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఆషాడ శుద్ధ పౌర్ణమి ఆదివారం భద్రకాళీ అమ్మవారిని వివిధ రకాల 270 కిలోల కూరగాయలతో అలకరించారు. వందల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భద్రకాళీ శరణం మమ నామస్మరణలతో మార్మోగింది. అమ్మవారికి ఉదయం వ్యాసపూజ, చతుస్థానార్చన, చండీహవనం, బలిప్రదానం, మహాపూర్ణాహుతి, తదితర పూజలు నిర్వహించారు. భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. logo