మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 13:57:40

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉదారత

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉదారత

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో బహ్రెయిన్ దేశం నుంచి హైదరాబాద్ వచ్చిన నిజామాబాద్, ఆర్మూరు, జగిత్యాల, కామారెడ్డిలకు చెందిన 153 మంది గల్ఫ్ కార్మికులు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు బయల్దేరారు. కాగా, బహ్రెయిన్  దేశంలో ఉన్న వలస కార్మికులను ఇండియా తీసుకొచ్చేందుకు, ఇండియన్ క్లబ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.

ఈ విమానంలో తెలంగాణ వాసులు స్వస్థలాలకు వచ్చేందుకు కావాల్సిన అనుమతులు, ఇతర కార్యక్రామాన్నింటినీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, బహ్రెయిన్  తెలంగాణ జాగృతి సమన్వయం చేశాయి. బహ్రైయిన్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు వరికుంట బాబు, నాయకులు ప్రభాకర్, విజయ్ వర్ధన్, శ్రీనివాస్ తదితరులు బహ్రెయిన్  లో సమన్వయం చేశారు.

జూన్ 27 న, బహ్రెయిన్  నుంచి గల్ఫ్ ఎయిర్ వేస్ విమానంలో 196 మంది హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా ప్రభుత్వ ఉచిత క్వారంటైన్లో ఉన్నారు. నేటితో వారం రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలకు చెందిన 153 మంది కార్మికులు, మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన నాలుగు బస్సుల్లో స్వస్థలాలకు బయలుదేరారు. ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన కవితకు వారు కృతజ్ఞతలు తెలిపారు.


logo