సోమవారం 13 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 14:47:12

డోలు, తుడుం వాయిస్తూ ..హరితహారం షురూ

డోలు, తుడుం వాయిస్తూ ..హరితహారం షురూ

ఆదిలాబాద్ : అడవి తల్లి ఒడిలో సేద తీరే ఆదివాసీలు హరిత లక్ష్యాన్ని గుర్తించారు. మొక్కల పెంపకంతోనే బతుకు బాగుంటుందని నమ్మారు. అడవినే దైవంగా నమ్మే ఆదివాసీలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో ఆదివాసీ గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం వడగాం చెందిన ఆదివాసీ గూడెం గిరిజనులు మంగళ హారతులతో తమ సంప్రదాయ వాయిద్యాలు డోలు, తుడుం వాయిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

హరితహారంలో తామ స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నామని గ్రామ పటేల్ లక్ష్మణ్ తెలిపారు. గ్రామస్తులు అందరం కలిసి హరితహారం కార్యక్రమం నిర్వహించడంతో వాటిని కాపాడే బాధ్యత సైతం తమపై ఉంటుందని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo