బుధవారం 08 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 14:34:14

ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న గోదావరి

ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న గోదావరి

నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువున గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు  కేంద్ర జల వనరుల శాఖ అధికారుల సమక్షంలో గేట్లు ఎత్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 14 గేట్లు ఎత్తి దిగువకు 0.62 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తి వేయడంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ కందకుర్తి త్రివేణి సంఘం వద్ద నీటి పరిమాణం పెరిగింది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది.logo