శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 08:47:42

లాక్‌డౌన్‌ భయంతో ఆంధ్రాకు పయనమవుతున్న జనం

లాక్‌డౌన్‌ భయంతో ఆంధ్రాకు పయనమవుతున్న జనం

హైదరాబాద్‌ : తెలంగాణాలో మరోసారి లాక్‌డౌన్‌ ఉంటుందనే ప్రచారం జరుగుతుండంతో ఏపీ వాసులు తమ సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో మంగళవారం రాత్రి విజయవాడ హైవేపై వాహనాలు బారులుదీరాయి. నిబంధనలకు అనుగుణంగా ఏపీలోకి అనుమతిస్తామని చెప్పడంతో సరిహద్దులో గందరగోళం నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో 15 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సారి లాక్‌డౌన్ మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో సొంత గ్రామాలకు ఆంధ్రవాసులు క్యూ కట్టారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక ఆంధ్రాలో సాయంత్రం 7గంటల వరకే వాహనాలకు అనుమతి ఉండడంతో అధికారులు వాహనాలను నిలిపివేస్తున్నారు.


logo