మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 15:07:08

హరితహారాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి

హరితహారాన్ని సమిష్టిగా  విజయవంతం చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో పలు గ్రామాల్లో హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. గ్రామ చెరువు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసి మంత్రి మాట్లాడారు. తాటికొండ చారిత్రక ప్రాంతం. ఇక్కడ సర్వాయి పాపన్న రాజ్యాన్ని పరిపాలించారన్నారు. ఇక్కడ హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

జిల్లాలో ఈ ఏడాది 52 లక్షల మొక్కలు నాటాలి. వివిధ నర్సరీల్లో 65.92 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అందరూ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కరోనా విస్తృతి నేపథ్యం లో అంతా జాగ్రత్తగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలి ప్రజలకు సూచించారు.logo