గురువారం 02 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 13:55:05

ప్రతి ఎకరానికి సాగునీరు : మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రతి ఎకరానికి సాగునీరు : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : సాగుకు యోగ్యమయ్యే ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పెద్దగూడెంలో వైకుంఠధామాన్ని ప్రారంభించి, ఖాన్ చెరువుకు నీళ్లు నింపే లిఫ్ట్ పనులకు మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు.పెద్దగూడెం కల నెరవేరింది. మాట ఇచ్చా .. నిలబెట్టుకుంటున్నానని మంత్రి తెలిపారు.1500 ఎకరాలకు సాగు నీరు, దాదాపు 400 మంది రైతులకు దీంతో ప్రయోజనం

 చేకూరుతుందన్నారు. రూ.79 లక్షలతో 120 హెచ్ పీ మోటారుతో  ఖాన్ చెరువు నింపేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేశామన్నారు. ఖాన్ చెరువు నింపి రాములవారి పాదాలు కడుగుతానన్నారు. విపక్ష నేతలు ఫిర్యాదులతో నీళ్లు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గానో కృషి చేస్తున్నారని తెలిపారు. 


logo