శనివారం 11 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 16:03:36

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేయూత

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల నుంచి ఇండియా చేరుకున్న తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరుకునేందుకు సహాయసహకారాలు అందించారు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన బస్సులో 32 మంది వివిధ జిల్లా లకు చెందిన తెలంగాణ వాసులు ఆదివారం తెల్లవారుజామున స్వస్థలాలకు చేరుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లకు చెందిన 32 మంది ఉపాధి నిమిత్తం గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశం బహ్రెయిన్ లో ఉంటున్నారు. అయితే కరోనా కారణంగా బహ్రెయిన్ లో ఉపాధి కోల్పోయి, రెండు వారాల క్రితం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. 

విజయవాడ లో 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ లో ఉన్నారు. జూన్ 26 తేదీన క్వారంటైన్ పూర్తయినా ప్రయాణ ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని పలువురు ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు తెలియజేశారు. దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ, విజయవాడ నుంచి బస్సు ఏర్పాటు చేశారు. బస్సులో మాస్కులు, సానిటైజర్ లు అందుబాటులో ఉంచారు.  జగిత్యాలకు బస్సు చేరుకోగానే టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు దావ సురేష్ , నాయకులు భోగ ప్రవీణ్, జాగృతి నాయకులు రాజేందర్ రావు స్వాగతం పలికారు. అడిగిన వెంటనే స్పందించి, బస్సు సౌకర్యం కల్పించిన కవితకి కృతజ్ఞతలు తెలిపారు.


logo