శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 13:18:52

మాజీ ప్ర‌ధాని పీవీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న నివాళి

మాజీ ప్ర‌ధాని పీవీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న నివాళి

హైద‌రాబాద్ : తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు మంత్రి. 

పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞాపభూమిలో నిర్వ‌హించిన ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.


logo