శనివారం 04 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 12:38:53

పీవీ శత జయంతి సందర్భంగా ఆలేరులో డయాలసిస్ కేంద్రం ప్రారంభం

పీవీ శత జయంతి సందర్భంగా ఆలేరులో డయాలసిస్ కేంద్రం ప్రారంభం

యాదాద్రి భువనగిరి : మహనీయుడు మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శత జయంతి రోజున ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఫ్లోరోసిస్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు బీబీనగర్ లో ఎయిమ్స్ తో పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు.

డయాలసిస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 కేంద్రాలను  ఏర్పాటు చేసినట్లు మంత్రి  పేర్కొన్నారు. ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చుట్టు పక్కల ప్రాంతాల వారికి స్వాంతన లభిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


logo