ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 11:52:21

పీవీ అపర చాణక్యుడు : ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు

పీవీ అపర చాణక్యుడు : ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు

వరంగల్ అర్బన్ : పీవీ అపర చాణక్యుడు.. సీఎం కేసీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించడంపై దేశమే హర్షిస్తుందని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ శత జయంతి సందర్భంగా హన్మకొండలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండా ప్రకాష్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరిత, సీపీ రవీందర్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి పీవీకి నివాళులు అర్పించి మాట్లాడారు.

పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. పీవీ ని గౌరవించేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ని అభినందిస్తున్నట్లు తెలిపారు. పీవీ విగ్రహం వద్ద హరితహారంలో భాగంగా మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు.


logo