శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 10:27:56

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి ఘన నివాళులు

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి ఘన నివాళులు

సూర్యాపేట : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుభాషా కోవిధుడికి విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి చారిత్రిక సందర్భంలో అద్భుతమైన నాయకత్వం అందించిన ఘనుడు పీవీ నరసింహారావు అన్నారు. సరైన సమయంలో ధైర్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పారు. ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ కు సుస్థిరస్థానం కల్పించిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. కష్టకాలంలో దేశానికి సరైన దిశానిర్దేశం చేసిన వారిలో పీవీని మించిన వారులేరన్నారు.


logo