సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 11:07:50

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి కొప్పుల

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి కొప్పుల

కరీంనగర్ : టీఆర్ఎస్ కోసం పని చేసే కార్యకర్తలకు పార్టీ కష్ట కాలంలో అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండలం ఆక్సాయిపల్లె  గ్రామానికి చెందిన రామిళ్ల పోచం విద్యుత్ షాక్ తో మరణించాడు. అతడికి పార్టీ సభ్యత్వం ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షలు మంజూరయ్యాయి.

చెక్కును లబ్ధిదారుడి భార్య రామిళ్ల లక్ష్మికి కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలను టీఆర్ఎస్  పార్టీ కంటికి రెప్పలా కాపాడుతుందన్నారు. కష్టపడి నిజాయితీగా పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు.


logo