గురువారం 16 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 18:07:59

చౌటుప్పల్‌లో తంగేడు వనాన్ని ప్రారంభించిన మంత్రులు

చౌటుప్పల్‌లో తంగేడు వనాన్ని  ప్రారంభించిన మంత్రులు

యాదాద్రి భువనగిరి :  జిల్లాలోని చౌటుప్పల్‌, లక్కారం రిజర్వు  అటవీ ప్రాంతంలో తంగేడు వనాన్ని, హైదరాబాద్- విజయవాడ  జాతీయ రహదారి పక్కనే అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను గురువారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జీ. జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహరం కార్యక్రమంలో భాగంగా మంత్రులిద్దరూ  మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అర్బన్‌ లంగ్‌స్పేస్‌లో భాగంగా 50.08 హెక్టార్ల విస్తీర్ణంలో  రూ.3.45 కోట్లతో అభివృద్ధి చేశారు.


logo