మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 17:55:32

హరితహారంతో పచ్చబడుతున్న పాలమూరు

హరితహారంతో పచ్చబడుతున్న పాలమూరు

మహబూబ్ నగర్ : ఒకప్పుడు హరిత పాలమురుగా వెలుగొందిన ఈ ప్రాంతం అడవులు నరికి వేయడంతో కాలక్రమేణా కరువు కాటకాలకు నిలయంగా మారింది. కానీ, ఆరేండ్లలో ప్రభుత్వం హరితహారాన్ని విజయవంతంగా చేపట్టడంతో రోజురోజుకు పరిస్థితులు మెరుగవుతున్నాయని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ, ఎదిర, మన్యంకొండ తదితర ప్రాంతాల్లో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ తో  సగం తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఒకప్పుడు తాగునీటికి ఈ ప్రాంతం కటకటలాడింది. కానీ మిషన్ భగీరతతో సురక్షిత మంచినీటిని ప్రతి ఇంటికి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు మొక్కల పరిరక్షణను ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇచ్చిన హరితహారం టార్గెట్ పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.


logo