మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 14:12:15

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి

సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి

ఖమ్మం : కరోనా కష్టకాలంలోనూ రైతన్నలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం నియోజకవర్గం కోయచలక గ్రామంలో రైతులను మంత్రి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఒక్కరోజే రికార్డు స్థాయిలో 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో వానకాలం పంట సాయం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.5,294 కోట్ల రైతుబంధు డబ్బులు జమ చేసిన ఘనత  తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, రైతులు, నాయకులు ఉన్నారు.


logo