శనివారం 04 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 17:35:25

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనదీక్ష

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనదీక్ష

సిద్దిపేట : ప్రేమించిన యువకుడు పెండ్లి చేసుకొని కాపురం చేయడానికి నిరాకరించడంతో.. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన దీక్షకు దిగిన సంఘటన జిల్లాలోని మద్దూరు మండలంతోర్నాలలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..మండలంలోని కూటిగల్‌కు చెందిన బోయిని కవిత గత ఏడాది కాలంగా మండలంలోని తోర్నాల గ్రామానికి చెందిన బింగి శ్రీనివాస్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ నెల 20న కూటిగల్‌ గ్రామ శివారులో కవిత మెడలో శ్రీనివాస్‌ తాళి కట్టాడు. 

ఈ క్రమంలో అత్తగారింటికి వెళ్లిన కవితను శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శ్రీనివాస్‌పై ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ ఇంటి ముందు కూర్చోని కవిత మౌనదీక్ష చేపట్టింది. తన భర్త తనను భార్యగా అంగీకరించే వరకు దీక్ష విరమించేది లేదని భీష్మించుకొని కూర్చుంది. దీంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని కవిత, శ్రీనివాస్‌లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ చేపట్టారు


logo