శనివారం 04 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 18:47:01

సూర్యపేటలో కర్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహం : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యపేటలో కర్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహం : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : జిల్లాకేంద్రంలో కర్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని, పాత బస్టాండ్‌ జంక్షన్‌కు ఆయన పేరు పెట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-1 ఉద్యోగ ఉత్తర్వు, హైదరాబాద్‌లో 711గజాల ఇంటి స్థలం, రూ.5కోట్ల నగదు అందజేశారన్నారు. త్యాగధనులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబంతో పాటు యావత్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమర సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించి, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారన్నారు. అలాంటి త్యాగధనులకు సమాజం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన సంతోషి

తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డికి కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాలన్ని పూర్తయిన మీదట తన ఇంటికి రావాలని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించడంపై ధన్యవాదాలు తెలిపారు.


logo