ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 17:29:55

నాటిన ప్రతి మొక్క బతకాలి : మంత్రి ఎర్రబెల్లి

నాటిన ప్రతి మొక్క బతకాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : ఉద్యమంలా హ‌రిత హారం చేపట్టాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఆరో విడ‌త తెలంగాణ‌కు హ‌రితహారం కార్యక్రమంపై హైదరాబాద్ లోని తన పేషీ నుంచి ముందస్తు సన్నాహకంగా అడిష‌న‌ల్ క‌లెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్ డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, స‌ర్పంచ్ లు, మండ‌ల స్థాయి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. విరివిగా మొక్కలు నాటి వైవిధ్యం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్షణకు పాటుప‌డాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. 

అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా అవి బతికేలా చూడాలి. గ్రామ సభల ద్వారా ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. గ్రామ పంచాయ‌తీల్లోని ప్లాంటేష‌న్, గ్రీన్ క‌వ‌ర్ క‌మిటీలు క్రియాశీల‌కంగా ప‌ని చేయాలని, ఎప్పటికప్పుడు నర్సరీలు, నాటిన మొక్కలను తనిఖీ చేస్తూ, అధికారులు పర్యవేక్షించాలన్నారు. హరిత హారం -2020 ప్రాధాన్యతపై సన్నాహక చర్యలు చేపట్టాలి. 

ప్రజాప్రతినిధులు స‌హా, జిల్లా, మండ‌ల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు పర్యవేక్షించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఉపాధి హామీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo