మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 15:19:23

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి కొప్పుల

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : మంత్రి కొప్పుల

కరీంనగర్ : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.  జిల్లాలోని పెగడపల్లి మండలం వెంగలాయిపేట గ్రామానికి చెందిన పిట్టల విద్యసాగర్ అనే కార్యకర్త విద్యుత్ షాక్ తో మరణించాడు. అతడికి పార్టీ సభ్యత్వం ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో విద్యాసాగర్ భార్య పిట్టల మేఘకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ కష్టకాలంలో తోడుగా ఉంటుందన్నారు. అలాగే నిజాయితీగా పనిచే కార్యకర్తలకు తగిన గుర్తింపు టీఆర్ఎస్ లోనే లభిస్తుందన్నారు.


logo