గురువారం 02 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 12:30:36

పూడికతీత పనులతో రైతులకు ఎంతో మేలు

పూడికతీత పనులతో రైతులకు ఎంతో మేలు

మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టడంలో భాగంగా జిల్లాలోని  కే సముద్రం మండలం, గాంధీ పురం, కల్వల గ్రామాల్లో ఎస్సారెస్పీ స్టేజ్-1 కెనాల్ లో పూడికతీత పనులను ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 

ఇదొక గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు. దీనివల్ల రైతులకు, కూలీలకు మేలు జరుగుతుందన్నారు.మహబూబాబాద్ నియోజకవర్గం లో 1000 రైతు కల్లాలు మంజూరు అయ్యాయి. జిల్లాలో 3,000 కల్లాల కోసం 200 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటితో పాటు రైతుకు ఏ అవసరం ఉంటే దానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేస్తామన్నారు. రైతుల కోసం ఇన్ని పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు దొంగ దీక్షలు చేస్తూ ఒట్టి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


logo