గురువారం 16 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 11:55:46

విధుల్లో అలసత్వం వహిస్తే వేటే : మంత్రి ఎర్రబెల్లి

విధుల్లో అలసత్వం వహిస్తే వేటే : మంత్రి ఎర్రబెల్లి

జనగామ: గ్రామాల్లో పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించే అధికారులపై వేటు తప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హరితహారం, కొవిడ్, పారిశుద్ధ్యం అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు.

 పారిశుధ్య పనుల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి గ్రామాల్లో పర్యటించిక పోవడంపై సదరు అధికారిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొనడంపై ఆయనను మందలించారు. విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులను డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడను అని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.


logo