శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 18:32:55

కూర‌గాయ‌లమ్మే వ్య‌క్తికి క‌రోనా.. ఆందోళ‌న‌లో మ‌హిళ‌లు

కూర‌గాయ‌లమ్మే వ్య‌క్తికి క‌రోనా.. ఆందోళ‌న‌లో మ‌హిళ‌లు

క‌రీంన‌గ‌ర్ : రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని జ‌మ్మికుంట మున్సిపాలిటీ ప‌రిధిలోని రామ‌న్న‌ప‌ల్లిలో కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అత‌ని వ‌ద్ద కూర‌గాయ‌లు తీసుకున్న మ‌హిళ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ వ్యాపారి ప్ర‌తి రోజు.. త‌న బైక్ పై తిరుగుతూ కూర‌గాయ‌లు అమ్ముతున్న‌ట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇత‌ని వ‌ద్ద కూర‌గాయ‌లు కొన్న వ్య‌క్తుల్లో సుమారు 20 మందిని గుర్తించి హోం క్వారంటైన్ చేశారు. క‌రోనా క‌ల‌కలం నేప‌థ్యంలో జ‌మ్మికుంట మున్సిపాలిటీ ప‌రిధిలో అధికారులు సోడియం హైపో క్లోరైడ్ తో శానిటేష‌న్ చేస్తున్నారు. logo