శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 01:15:19

నీటిపారుదలకు ‘ఉపాధి’ అనుసంధానం

నీటిపారుదలకు ‘ఉపాధి’ అనుసంధానం

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్ధన్నపేట: రైతుల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల రంగానికి అనుసంధానం చేసిన ప్రభుత్వం రూ. 1,231 కోట్లను కేటాయించిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇందులో భాగంగానే వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారం గ్రామంలో మిషన్‌ భగీరథ ద్వారా నిర్మించిన వాటర్‌ట్యాంకు, ఇటీవల దేవాదుల కెనాల్‌ అనుసంధానంగా  ఉపకాలువల పనులను నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ ద్వారా కాలువల పనులను రాష్ట్రంలోనే తొలిసారిగా శుక్రవారమే ప్రారంభించినట్లు తెలిపారు. వలస కూలీలకు పని కల్పించడం కోసం రాష్ట్రంలో గత నెలలో లక్షకుపైగా జాబ్‌కార్డులు అందజేశామన్నారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజినీర్‌ బంగారయ్య, జెడ్పీచైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, కలెక్టర్‌ హరిత పాల్గొన్నారు.


logo