మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 17:20:22

జలహితంతో..గ్రామాలు సుభిక్షం

జలహితంతో..గ్రామాలు సుభిక్షం

వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం క్రింద రూ. 1200 కోట్లతో జలహితం కార్యక్రమం చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలహితం పేరిట చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో పని కోల్పోయిన  వలస కార్మికులకు,  గ్రామీణ  ప్రాంత ప్రజలకు జలహితం కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొదించవచ్చన్నారు. 

ఇదిలా ఉండగా దేశంలోనే మన రాష్ట్రం ఉపాధి హామీ పని దినాలు కల్పించడంలో ముందంజలో ఉందన్నారు. అదే విధంగా జిల్లాలో ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు దృష్టి సారించామన్నారు. జిల్లాలో 44 లక్షల పై చిలుకు చెట్లు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు.


logo