గురువారం 02 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 10:45:29

ఆర్ వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు

ఆర్ వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు

అదిలాబాద్ : గిరిజనులు సాగు చేస్తున్న ఆర్ వోఎఫ్ఆర్ భూములకు ప్రభుత్వం రైతుబంధు పథకం వర్తింపు చేయడంతో జిల్లాలో గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం జిల్లాలోని అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం 2006లో భూమి హక్కు పత్రాలను పంపిణీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 189 గ్రామాల్లో 69 వేల ఆరు వందల 55 ఎకరాలను 17,657 మంది గిరిజనులకు పంపిణీ చేశారు.  రైతుల వివరాలు, భూముల లెక్కలు సరిగా ఉండక పోవడంతో బ్యాంకు రుణాలు సైతం లభించలేదు.

 తెలంగాణ ప్రభుత్వం ఆర్ ఓఎఫ్ ఆర్ భూములు ఉన్న రైతులకు సైతం రైతుబంధు పథకం ఇస్తుండడంతో గిరిజనులకు పెట్టుబడుల కోసం ఇబ్బందులు తప్పాయి. జిల్లాలోని 17,657 మంది రైతులకు రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందనుంది. సర్కార్ అందిస్తున్న సాయం పట్ల గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము పంట పెట్టుబడుల కోసం దళారులను ఆశ్రయించేవారమని, ఇప్పుడు రైతుబంధు పథకంతో వచ్చే డబ్బులతో విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆనందంగా చెప్తున్నారు.logo