శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 23:08:14

భార్యా,భర్తలకు ఒకే చితిపై అంత్యక్రియలు

భార్యా,భర్తలకు ఒకే చితిపై అంత్యక్రియలు

హైదరాబాద్: కృష్ణ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే... మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి బంధువుల రోధనలతో ఊరంతా తల్లడిల్లిపోయింది . ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందగా. వీరందరికీ గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు. వీరిలో భార్యా, భర్తలిరువురినీ ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మరణంలోనూ వారి బంధం విడిపోలేదని, చావులోనూ ఒక్కటయ్యారంటూ చూసినవారు కన్నీటి పర్యంతమయ్యారు. logo