సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 17:15:19

నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ల పట్టివేత

నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ల పట్టివేత

అసిఫాబాద్ కుమ్రం భీం : జిల్లాలోని పెంచికల్ పేట్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. అగర్ గూడా సమీపంలో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 77 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. బెజ్జూర్ మండలంలోని తలాయి గ్రామం నుంచి సత్తిరెడ్డి, సాయి అనే ఇద్దరు వ్యక్తులు పత్తి విత్తనాలను తీసుకు వస్తుండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. వీటి విలువ సుమారు 77 వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.  బైక్ ను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


logo