శనివారం 04 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 07:21:03

లలిత కళల పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

లలిత కళల పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : కాసుల చిత్రకళా అకాడమీ ఆధ్వర్యంలో లలిత కళల పోటీలు నిర్వహిస్తున్నామని అకాడమీ వ్యవస్థాపకురాలు కాసుల పద్మావతి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ వేదికగా నృత్యం, సంగీతం, యాక్టింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, యోగ, ఫ్యాషన్‌  తదితర రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 

పోటీల్లో పాల్గొనే వారు  ఒక వీడియో లింక్‌ను లేదా ఫొటోను విధిగా జతచేయాలని తెలిపారు. ఆసక్తిగలవారు పేరు నమోదు కోసం రూ.100 రుసుం చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజును పేటీఎం  నంబర్‌ 8498956656, గూగుల్‌ పే -8463910777 ద్వారా చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు  8463910777 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.


logo