సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 06:45:17

జోగుళాంబ హుండీ ఆదాయం రూ. 41,26,562

జోగుళాంబ హుండీ ఆదాయం రూ. 41,26,562

అలంపూర్‌ : అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ ఆదాయం రూ.41,26,562 వచ్చినట్లు సోమవారం ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌రావు తెలిపారు. ఉభయ ఆలయాల్లో మొత్తం 16 హుండీలు ఉండగా, మూడు నెలలకోసారి హుండీ లెక్కింపు ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు నెలల 22 రోజులకు లెక్కించారు.

మొత్తం హుండీలకు గానూ, అమ్మవారి ఆలయంలోని ఎనిమిది హుండీలను మాత్రమే లెక్కించినట్లు ఈవో తెలిపారు. అయితే పై లెక్క కేవలం నోట్లకు సంబంధించి మాత్రమేనని చిల్లర నాణెలు, ఆభరణాలు లెక్కించాల్సి ఉందన్నారు. మిగతా హుండీలను మంగళవారం లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


logo