బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 22:37:13

‘ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌' పోస్టుల వెబ్‌ ఆప్షన్లకు గడువు పెంపు

‘ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌' పోస్టుల వెబ్‌ ఆప్షన్లకు గడువు పెంపు

హైదరాబాద్‌ : ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే గడువును టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. వాస్తవానికి గడువు సోమవారంతో ముగిసింది. అయితే అభ్యర్థుల నుంచి  వచ్చిన విన్నపం మేరకు గడువును మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్టు సోమవారం టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నది. ఎంపికైన అభ్యర్థులంతా కచ్చితంగా 17వ తేదీలోగా ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని, వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించింది. మరోసారిగడువు పొడిగించే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీల్లో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. 


logo