శనివారం 04 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 22:28:01

కరోనా టెస్టులు నిర్వహించే ప్రైవేటు ల్యాబ్స్‌ ఇవే..

కరోనా టెస్టులు నిర్వహించే ప్రైవేటు ల్యాబ్స్‌ ఇవే..

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షలకు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పైవేట్‌ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలకు అనుమతివ్వడంతో.. అనుమానం ఉన్నవారు ఈజీగా పరీక్షలు నిర్వహించుకునే అవకాశముంటుంది. దీంతో ప్రజలలో కరోనా భయం పోవడంతో పాటు మరింత జాగ్రత్తగా ఉండేందుకు అవకాశాలుంటాయి. నగరంలో కరోనా పరీక్షలకు అనుమతి పొందిన ల్యాబ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.                                                                                   

 • అపోలో హాస్పిటల్‌ లాబరేటరీ సర్వీసెస్‌ (జుబ్లీహిల్స్‌)
 • విజయ డయాగ్నస్టిక్‌(హిమాయత్‌నగర్‌)
 • విమ్ట ల్యాబ్స్‌ (చర్లపల్లి)
 • అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌ైస్టెల్‌ లిమిటెడ్‌, డయాగ్నస్టిక్‌ లాబరేటరీ(బోయిన్‌పల్లి)
 • డాక్టర్‌ రెమిడీస్‌ ల్యాబ్స్‌(పంజాగుట్ట)
 • పత్‌కేర్‌ ల్యాబ్స్‌ (మేడ్చల్‌)
 • అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ అండళ్‌ ల్యాబ్‌ సైన్స్‌స్‌(శేరిలింగంపల్లి)
 • యశోద హాస్పిటల్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మెడిసన్‌(సికింద్రాబాద్‌)
 • బయోగ్నోసిస్‌ టెక్నాలజీస్‌(మేడ్చల్‌)
 • టెనెంట్‌ డయాగ్నస్టిక్స్‌(బంజారాహిల్స్‌)
 • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌, స్టార్‌ హాస్పిటల్‌(బంజారాహిల్స్‌)


logo